News August 28, 2025

రాయికల్: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

image

రాయికల్ మండలం చింతలూరు శివారులో జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో నివసించే సుద్దేవార్ వినోద్ (21) అనే యువకుడు బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్ఐ దేవేందర్ తెలిపారు. ఇంటి వద్ద ఖాళీగా ఉండడంతో ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్ళిన వినోద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. మృతుని తండ్రి రాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నానమన్నారు.

Similar News

News August 28, 2025

VJA: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP), చర్లపల్లి(CHZ) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.08579 VSKP- CHZ రైలును OCT 3 నుంచి NOV 28 వరకు ప్రతి శుక్రవారం, నెం.08580 CHZ- VSKP రైలును OCT 4 నుంచి NOV 29 వరకు ప్రతి శనివారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించారు.

News August 28, 2025

కడప: శనగలతో వినాయకుడు

image

వినాయక చవితి పండుగ సందర్భంగా కడప నగరంలో ఊరగాయల వీధిలో ప్రత్యేక అలంకరణలో వినాయకుని రూపొందించారు. మట్టి వినాయకుని ప్రతిష్ఠించడంతో పాటు ప్రత్యేకంగా శనగలతో వినాయకుని రూపొందించి ప్రత్యేకంగా పూజలు చేశారు. వంకదార రాము ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కో పదార్థాలతో వినాయకుని రూపొందిస్తూ కడప ప్రజలకు ఆకర్షణంగా నిలుస్తున్నారు. స్వామిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు

News August 28, 2025

అంతర్గాం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అప్డేట్

image

అంతర్గాం(M) శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. 40 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.