News August 28, 2025

TODAY HEADLINES

image

✷ తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
✷ వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ డెవలప్‌మెంట్: CM రేవంత్
✷ అర్హులెవరికీ అన్యాయం జరగదు: AP CM చంద్రబాబు
✷ APలో భారీ వర్షాలు.. నీటి ప్రాజెక్టులకు భారీగా వరద
✷ భారత్ మంచితనం.. పాక్‌లో 1.50 లక్షల మంది సేఫ్
✷ అమల్లోకి వచ్చిన 50% టారిఫ్స్
✷ IPLకు అశ్విన్ రిటైర్మెంట్

Similar News

News August 28, 2025

భారత్‌తో వైరం.. ట్రంప్‌పై హౌస్ డెమోక్రాట్స్ ఫైర్

image

భారత్‌పై ట్రంప్ టారిఫ్స్ విధించడాన్ని అమెరికన్లు సైతం తప్పుపడుతున్నారు. తాజాగా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్స్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ‘రష్యా నుంచి భారీగా ఆయిల్ కొంటున్న చైనా తదితర దేశాలపై టారిఫ్స్ వేయకుండా ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. US-భారత్ సంబంధాలను దెబ్బతీస్తున్నారు. అమెరికన్స్‌కు నష్టం జరుగుతోంది. ఇది ఉక్రెయిన్ కోసం చేస్తున్నట్లు అనిపించట్లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News August 28, 2025

మరో 6 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

TGలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 6 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నల్గొండ, యాదాద్రి, KNR, ఖమ్మం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. <<17538468>>ఇప్పటికే<<>> కామారెడ్డి, MDK, నిర్మల్, ADB, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది.

News August 28, 2025

కామారెడ్డిలో మళ్లీ మొదలైన వర్షం

image

TG: కామారెడ్డిలో తెల్లవారుజాము నుంచే ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. GRకాలనీ, అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.