News August 28, 2025
8ఏళ్లు సైన్యంలో సేవలు.. DSCలో 2ఉద్యోగాలు

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలోని కృష్ణదొడ్డికి చెందిన గోపాల్, పుణ్యవతి దంపతుల కుమారుడు కోదండరాముడు గత 8ఏళ్లుగా ఆర్మీలో సైనికునిగా పనిచేశారు. 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఏపీ మెగా DSCలో స్కూల్ అసిస్టెంట్ సోషల్‌లో 86.07 మార్కులు సాధించారు. దీంతో జిల్లాలో 2వ ర్యాంక్, స్టేట్‌లో 13వ ర్యాంక్ రాగా SGTలో 87.77 మార్కులతో జిల్లా 94వ ర్యాంక్‌తో 2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
Similar News
News August 28, 2025
Way2News కథనానికి స్పందించిన ఆదోని సబ్ కలెక్టర్

Way2News కథనానికి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్పందించారు. బుధవారం ‘ఆదోనిలో వైరల్ ఫీవర్లు.. హాస్పిటల్లో <<17531451>>రోగుల ఇబ్బందులు<<>>’ శీర్షికతో కథనం వెలువడింది. స్పందించిన సబ్ కలెక్టర్ ఇవాళ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో కలియతిరిగి రోగుల సమస్యలపై ఆరా తీశారు. వైద్యులు సరైన వైద్యం అందిస్తున్నారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరతను తీర్చి, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
News August 28, 2025
కర్నూలులో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం

డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ గురువారం కర్నూలు DEO శామ్యూల్ పాల్ అధ్యక్షతన ప్రారంభమైంది. రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియను రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ నవ్య పరిశీలించారు. కౌన్సెలింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.
News August 28, 2025
వ్యవసాయ కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం

డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో దేవనకొండ మండలం కొత్తపేటకి చెందిన పీరా సాహెబ్, షాజిదాబీ దంపతుల కూతురు మస్తాన్ బి సత్తా చాటారు. తల్లిదండ్రులు పొలం పనులు చేస్తూ కూతురు ఉన్నత శిఖరాలను చూడాలని ఎన్నో కలలు కన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చదివించారు. మస్తాన్ బి డీఎస్సీ ఫలితాలలో 77.88 మార్కులు సాధించి ఎస్‌జిటి పోస్ట్‌కు ఎంపికైంది. తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.