News August 28, 2025

HYD: త్వరలో అందుబాటులోకి 4 చెరువులు

image

హైదరాబాద్‌లో త్వరలో మరో 4 చెరువులు అందుబాటులోకి రానున్నాయి. ఉప్పల్ నల్ల చెరువు, బమృక్ దౌలా చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, తమ్మిడికుంట అందుబాటులోకి వస్తాయని హైడ్రా తెలిపింది. అంతేకాక రాబోయే కొద్ది నెలలలోనే రెండో విడతలో మరో 13 చెరువుల అభివృద్ధిని చేపడతామని పేర్కొంది. చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించింది.

Similar News

News August 28, 2025

HYD: నిమజ్జనోత్సవ భద్రతకు 30 వేల మంది పోలీసులు

image

మహానగరంలో వైభవంగా జరిగే గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రై కమిషనరేట్ల కమిషనర్లు అందుకు తగ్గ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. శోభాయాత్ర జరిగే సెప్టెంబర్ 6న 30,000 మంది పోలీసులను రంగంలోకి దించనున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News August 28, 2025

HYD: BEd అభ్యర్థులకు గమనిక.. ఇదే లాస్ట్ ఛాన్స్

image

BEdలో చేరాలనుకునే అభ్యర్థులకు ప్రభుత్వం చిట్ట చివరి అవకాశం కల్పిస్తోంది. రేపటి నుంచి (29వ తేదీ)నుంచి సెప్టెంబర్ 2 వరకు ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. రేపటినుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ పేమెంట్ చేయడంతోపాటు అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. ఎంపికైన వారి వివరాలు 11న వెల్లడిస్తామన్నారు.

News August 28, 2025

KCR కీలక నిర్ణయం.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరం?

image

వచ్చేనెల 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి BRS కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అటు NDA అభ్యర్థికి గానీ, ఇండీ కూటమి అభ్యర్థికి గానీ ఓటు వేయకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత వినోద్ కుమార్ తెలిపారు.