News August 28, 2025

ఆగస్టు 28: చరిత్రలో ఈ రోజు

image

1934: దక్షిణ భారత దేశపు నేపథ్య గాయని ఎ.పి.కోమల జననం
1949: నటి డబ్బింగ్ జానకి జననం
1959: సినీ నటుడు సుమన్ జననం(ఫొటోలో)
1983: శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ జననం
2006: నటుడు, దర్శకుడు డి.వి.నరసరాజు మరణం

Similar News

News August 28, 2025

సెలవుపై ముందే నిర్ణయం తీసుకోవచ్చుగా.. నెటిజన్ల సూచన

image

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పదికి పైగా జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొన్ని జిల్లాల్లో లేటుగా తీసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చాలాచోట్ల స్కూళ్లకు పిల్లలు, టీచర్లు చేరుకున్నాక సెలవు ప్రకటించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి సూచనలు తీసుకుని ముందు రోజే సెలవుపై నిర్ణయం తీసుకోవడం అంత కష్టమా అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News August 28, 2025

రేవంత్ గెటప్‌లోని వినాయక విగ్రహం తొలగింపు

image

TG: హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం హబీబ్‌నగర్‌లో CM రేవంత్‌ గెటప్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో సౌత్ వెస్ట్ DCP మండపాన్ని సందర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దంటూ నిర్వాహకుడు సాయికుమార్‌ను హెచ్చరించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఆ విగ్రహాన్ని తొలగించి మరొకటి ఏర్పాటు చేశారు. అంతకుముందు దీనిపై MLA రాజాసింగ్ పోలీసులకు <<17538582>>ఫిర్యాదు<<>> చేశారు.

News August 28, 2025

నాలుగు జిల్లాలకు RED ALERT

image

TG: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 20 గంటల పాటు అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని వెల్లడించింది. కాగా నిన్న కురిసిన వర్షాలకు నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.