News August 28, 2025
సంగారెడ్డి: మోడల్ స్కూల్స్‌లో స్పాట్ అడ్మిషన్లు

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఇటీవల 2025-26 విద్యా సంవత్సరానికి మోడల్ స్కూల్స్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని మునిపల్లి, పోతులబొగూడ తదితర పాఠశాలలో ఇంకా సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.
Similar News
News August 28, 2025
నందిగామ బ్రిడ్జిని సందర్శించిన మంత్రి రాజనర్సింహ

నిజాంపేట మండల పరిధిలోని నందిగామలో కూలిన బ్రిడ్జిని మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలకు ప్రజలు అధైర్య పడవద్దని, వర్షానికి నష్టపోయిన వారికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కలెక్టర్ స్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అందుబాటులో ఉన్నారని, ఏదైనా సమస్య ఉంటే వారికి తెలపాలని సూచించారు.
News August 28, 2025
కొత్తపల్లిని రెవెన్యూ గ్రామంగా మారుస్తా: MP

నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామంగా మార్చుటకు కృషి చేస్తామని ఎంపీ గోడం నగేష్ హమిచ్చారు. గురువారం ఆదిలాబాదులోని ఆయన నివాసంలో గ్రామస్థులు ఎంపీను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తపల్లి గ్రామంలో ఉన్న శ్రీహనుమాన్ ఆలయానికి ప్రహరీ కోసం రూ.5 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో చౌహన్ దిగంబర్, గుణవంతరావు, శ్యామరావు, కేశవ్, దీపక్, ప్రవీణ్ నాయక్ తదితరులున్నారు.
News August 28, 2025
కల్వకుర్తి: వంతెన నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలి- కలెక్టర్

కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట-రామగిరి గ్రామాల మధ్య ఉన్న దుందుభి వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన వాగును పరిశీలించారు. ప్రజలు వాగు దాటకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.