News August 28, 2025
యూఎస్ టారిఫ్స్ భారత్‌కు మేల్కొలుపు: రఘురామ్ రాజన్

యూఎస్ టారిఫ్స్ భారత్‌కు మేల్కొలుపు వంటిదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్ అనేవి ఇప్పుడు ఆయుధాలుగా మారుతున్నాయని ఇండియా టుడేతో చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. యువతకు ఉపాధిని కల్పించేందుకు, అవసరమైన వృద్ధి రేటు 8-8.5% సాధించడంలో సంస్కరణలను ఆవిష్కరించాలన్నారు.
Similar News
News August 28, 2025
ఈ ప్రత్యేకమైన గణనాథుడి గురించి తెలుసా?

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాలజ్ గ్రామంలో కర్రతో చేసిన సత్య గణేశుడిని పూజిస్తారు. వినాయక చవితి రోజు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజులు ఉత్సవాలు చేస్తారు. చివరి రోజు ఊరేగించి, నీళ్లు చల్లి ఆలయంలోని గదిలో భద్రపరుస్తారు. 1948లో పాలజ్‌లో కలరా, ప్లేగు వ్యాధులతో చాలా మంది చనిపోవడంతో కర్ర గణపతిని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.
News August 28, 2025
సెలవుపై ముందే నిర్ణయం తీసుకోవచ్చుగా.. నెటిజన్ల సూచన

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పదికి పైగా జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొన్ని జిల్లాల్లో లేటుగా తీసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చాలాచోట్ల స్కూళ్లకు పిల్లలు, టీచర్లు చేరుకున్నాక సెలవు ప్రకటించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి సూచనలు తీసుకుని ముందు రోజే సెలవుపై నిర్ణయం తీసుకోవడం అంత కష్టమా అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News August 28, 2025
రేవంత్ గెటప్‌లోని వినాయక విగ్రహం తొలగింపు

TG: హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం హబీబ్‌నగర్‌లో CM రేవంత్ గెటప్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో సౌత్ వెస్ట్ DCP మండపాన్ని సందర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దంటూ నిర్వాహకుడు సాయికుమార్‌ను హెచ్చరించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఆ విగ్రహాన్ని తొలగించి మరొకటి ఏర్పాటు చేశారు. అంతకుముందు దీనిపై MLA రాజాసింగ్ పోలీసులకు <<17538582>>ఫిర్యాదు<<>> చేశారు.