News August 28, 2025
రంగారెడ్డి: ఐక్యతకు ప్రతీకగా అన్నసాగర్

యాలాల మండలం అన్నసాగర్ గ్రామం ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు ఏకతాటిపై పండుగలు జరుపుకుంటాయి. ప్రతి సంవత్సరం అంజనేయస్వామి ఆలయంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఐదు రోజుల పాటు పూజలు, అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం గ్రామస్థుల మధ్య సోదరభావాన్ని పెంచుతోంది.
Similar News
News August 27, 2025
ALERT: HYDలో భారీ వర్షం పడుతోంది!

మంగళవారం సాయంత్రి నుంచి నగరవ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, మియాపూర్, హఫీజ్‌పేట, కొండపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, నల్లగండ్ల, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి పండగ వేల మార్కెట్లకు వెళ్లే ప్రజలు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News August 26, 2025
RR: వేతనాలు అందక ఆదర్శ ఉపాధ్యాయుల అవస్థలు

తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది గత ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇలా కఠినంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
News August 25, 2025
ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ: సీఎం

ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూలో హాస్టల్ భవనాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఉస్మానియా వర్సిటీ, తెలంగాణ అవిభక్త కవలలు లాంటివని.. పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారేనన్నారు. తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చిన ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా వర్సిటీయేనని తెలిపారు.