News August 28, 2025
గ్రేటర్లో అస్తవ్యస్తంగా జలమండలి నల్ల కనెక్షన్ మీటర్లు..!

గ్రేటర్ హైదరాబాద్‌లోని 14.07 లక్షల జలమండలి నల్లా కనెక్షన్లలో సగం మీటర్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో వినియోగదారులకు బిల్లులు అస్తవ్యస్తంగా వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కొత్త మీటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నా, పాడైన మీటర్లు మార్చుకోవాలన్నా సరైన పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు అధికారులను కోరుతున్నారు.
Similar News
News August 28, 2025
భారీ వర్షాలు.. లేహ్‌లో చిక్కుకున్న మాధవన్

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా నటుడు మాధవన్ మరోసారి లేహ్‌లో చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 17 ఏళ్లనాటి ఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘మేము షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. గత 4రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. విమానాశ్రయాలు కూడా మూతపడ్డాయి. 2008లో త్రీ ఇడియట్స్ షూట్ కోసం వచ్చినప్పుడు కూడా ఇలాగే చిక్కుకున్నాం. అప్పుడు మంచు విపరీతంగా కురిసింది’ అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు.
News August 28, 2025
లింగాల మండలంలో 120.2 మిల్లీమీటర్ల వర్షపాతం

గడచిన 24 గంటలలో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా లింగాల మండలంలో 120.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పెద్దకొత్తపల్లిలో 37.8, తెలకపల్లిలో 19.6, బిజినేపల్లిలో 16.2, నాగర్‌కర్నూలులో 13.2, ఊరుకొండలో 11.4, అచ్చంపేటలో 13.4, తాడూరులో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
News August 28, 2025
కర్నూలులో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం

డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ గురువారం కర్నూలు DEO శామ్యూల్ పాల్ అధ్యక్షతన ప్రారంభమైంది. రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియను రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ నవ్య పరిశీలించారు. కౌన్సెలింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.