News August 28, 2025

KNR: 94 మంది సహకార సంఘాల కార్యదర్శుల బదిలీలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార సంఘాల కార్యదర్శులను భారీగా బదిలీ చేశారు. మొత్తం 125 సంఘాల్లో 94 మంది కార్యదర్శులను మారుస్తూ సహకార శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేచోట ఎక్కువ కాలం పనిచేయడం వల్ల నిధుల దుర్వినియోగం, అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. KNR-25, JGTL-37, PDPL-18, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14మంది బదిలీ అయ్యారు.

Similar News

News August 28, 2025

బయ్యారం: పెద్ద చెరువును పరిశీలించిన కలెక్టర్

image

రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బయ్యారంలోని పెద్ద చెరువును గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద చెరువు సమీపంలో ఉన్న పలు కాలనీల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 28, 2025

20 కోచ్‌లతో నడవనున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్

image

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు డిమాండ్ దృష్ట్యా కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 20కి పెంచనున్నారు. జులై 31 నాటికి ఈ రైలుకున్న ఆక్యుపెన్సీ ఆధారంగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం మినహా రోజూ ఉ.6.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరే ఈ రైలు మ.2.35కి తిరుపతి చేరుతుంది. అక్కడ 3.15కు బయల్దేరి రాత్రి 11.40కి SC చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

News August 28, 2025

GREAT: కబడ్డీ ఇండియా క్యాంపుకు పాలమూరు బిడ్డ ఎంపిక

image

NGKL జిల్లా పదర మండలానికి చెందిన బండి నందిని, మహిళల కబడ్డీ అండర్-18 విభాగంలో ఇండియా క్యాంపునకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ Way2Newsతో తెలిపారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నందిని, గురువారం ఢిల్లీలోని సోనీపత్‌లో జరిగే ఇండియా క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు రమేశ్, రామాదేవి సంతోషం వ్యక్తం చేశారు.