News August 28, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం, పలాస మీదుగా సంత్రాగచ్చి(SRC)- యశ్వంత్‌పూర్(YPR) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02863 SRC- YPR రైలును Sept 4 నుంచి Sept 18 వరకు ప్రతి గురువారం, నం.02864 YPR- SRC మధ్య నడిచే రైలును Sept 6 నుంచి Sept 20 వరకు ప్రతి శనివారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News August 28, 2025
టెక్కలి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30 న జాబ్ మేళా

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.టీ.గోవిందమ్మ గురువారం తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీలు నిర్వహించే ఈ జాబ్ మేళాలో 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన వారు జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
News August 28, 2025
కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి: మంత్రి అచ్చెన్న

కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు దేవాదయ శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న నెల 23 నుంచి 25 వరకు జరగనున్న పండగ మహోత్సవం నేపథ్యంలో గురువారం నిమ్మాడ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
News August 28, 2025
శ్రీకాకుళం: సావిత్రమ్మ నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని చిత్రంజన్ వీధికి చెందిన భారటం సావిత్రమ్మ (85) గురువారం ఉదయం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు విషయాన్ని తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.