News August 28, 2025
విజయవాడ: మేనేజర్ జాబ్స్.. రూ. 40 వేల జీతం

విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన జిల్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) మేనేజర్ ఉద్యోగాల(6) భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత కోర్సులలో బీటెక్, పీజీ చేసి మూడేళ్ల అనుభవమున్న అభ్యర్థులు SEPT 6లోపు https://apts.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల వేతనం ఇస్తామని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలన్నారు.
Similar News
News August 28, 2025
బాపట్లలో దివ్యాంగుల ప్రేమ వివాహం

బాపట్ల పట్టణంలో గురువారం దివ్యాంగులు ప్రేమ వివాహం చేసుకున్నారు. పర్చూరు మండలం గొల్లపూడికి చెందిన గంగాధర్, ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన శిరీష ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో పట్టణంలోని దివ్యాంగుల సంఘం సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణ పోలీసులను ఆశ్రయించి రక్షణ కొరతామన్నారు.
News August 28, 2025
భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ మహేశ్

భారీ వర్షాలు, గోదావరి నదిలో వరద ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని MP మహేశ్ సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఈ నంబర్‌లకు కాల్ చేయవచ్చని చెప్పారు. కలెక్టరేట్ కంట్రోల్ నంబర్స్ 1800233-1077, 94910 41419, MP క్యాంపు కార్యాలయ నంబర్స్: 9618194377, 9885519299.
News August 28, 2025
భారీ వర్షాలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. లోతట్టు ప్రాంతాలకు, నీరు ప్రవహిత ప్రాంతాలకు, వాగులు, చెక్ డ్యాముల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. చెట్ల క్రింద నిల్చోరాదని, కరెంటు వైర్స్ వద్ద నిలబడవద్దని, పాత ఇల్లు, షెడ్లు వంటి వాటిలో నివసించవద్దని అత్యవసర పరిస్థితుల్లో 100ను సంప్రదించాలని కోరారు.


