News April 2, 2024

కశ్మీర్ లోయ ఓట్లు ఎవరికో? – 3/3

image

ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో పీడీపీ ఒంటరి పోరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ NC, PDPలు… సమర్థిస్తూ BJP కశ్మీర్‌లో పోటీకి దిగనున్నాయి. మరోవైపు జమ్మూలో ఈసారి గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తోంది. లద్ధాక్‌లో స్థానికుల నిరసన ఎన్నికలపై ప్రభావం చూపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ రైట్స్‌పై స్థానికులు పోరాడుతున్నారు.
<<-se>>#Elections2024<<>>

Similar News

News January 5, 2026

వంటింటి చిట్కాలు

image

* పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపి పేపరు కవర్లలో భద్రం చేస్తే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి.
* బ్రెడ్ ప్యాకెట్లో బంగాళాదుంప ముక్కలు ఉంచితే ఆ బ్రెడ్ తొందరగా పాడవదు.
* ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి వాటిని కట్ చేసినపుడు చేతులకు వాటి వాసన పోదు. అప్పుడు చేతిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని కొంచెంసేపు శుభ్రంగా రుద్దికడిగితే వాసనలు పోతాయి.

News January 5, 2026

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి

image

USలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో APలోని పాలకొల్లుకు చెందిన దంపతులు మరణించారు. వాషింగ్టన్‌లో పదేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కొటికలపూడి కృష్ణకిశోర్(45), ఆయన భార్య ఆశ కన్నా(40) పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ మరణించగా వారి కుమారుడు, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణకిశోర్ కుటుంబం 10 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లింది.

News January 5, 2026

కలుషిత నీరు.. 17కి చేరిన మరణాలు

image

ఇండోర్‌ భగీరథ్‌పురలో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి మరణించిన వారి సంఖ్య 17కి పెరిగింది. తాజాగా ఓం ప్రకాశ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మృతిచెందారు. ఇప్పటివరకు 398 మంది ఆస్పత్రిలో చేరగా 256 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం రేపు కోర్టులో నివేదిక ఇవ్వనుంది. మంచినీటి పైప్ లైన్‌లో మురుగునీరు కలవడమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.