News August 28, 2025
VZM: ఈనెల 29న జాబ్ మేళా

విజయనగరం (D) జామి (M) భీమసింగిలోని శ్రీ బాలాజీ జూనియర్ కాలేజీలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లమా, డిగ్రీ, బీటెక్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల యువతీ, యువకులు <
Similar News
News August 28, 2025
VZM: 452 మందిపై కేసులు..రూ. 4.75 లక్షలు ఈ-చలానాలు

హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం హెచ్చరించారు. ఆగష్టు 18 నుంచి 24వ తేదీ వరుకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. మొత్తం 452 కేసులు నమోదు చేసి రూ.4.75 లక్షల ఈ-చలానాలు విధించామన్నారు. ద్విచక్రవాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. హెల్మెట్ ఉంటే ప్రాణాపాయం నుంచి బయట పడొచ్చన్నారు.
News August 28, 2025
VZM: టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి 8 మంది పోటీ..!

జిల్లా TDP అధ్యక్ష పదవికి పోటీ గట్టిగానే ఉంది. 8 మంది TDP సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు చర్చ సాగుతుంది. వారిలో KA నాయుడు, సువ్వాడ రవిశంకర్, కంది చంద్రశేఖర్, కరణం శివరామకృష్ణ, కోళ్ల అప్పలనాయుడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరో నలుగురుTDP సీనియర్ నేతల అధ్యక్ష పదవికి దరఖాస్తులు చేశారు. ఇటీవల త్రిసభ్య కమిటీ సమావేశం కూడా జరిగింది. 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News August 27, 2025
జిల్లా నుంచి పారా జాతీయ స్థాయి పోటీలకు పయనం

పారా రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 13 మంది ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వేదికగా ఈనెల 29 నుంచి 31 వరకు జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2025 జరగనుంది. ఈ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు బుధవారం బయలుదేరారు. వీరందరికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులుదయానంద్ అభినందనలు తెలిపారు.