News August 28, 2025
వైసీపీ జిల్లా పార్టీ కార్యదర్శిగా విష్ణు నారాయణ

పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన విష్ణునారాయణను అనంతపురం జిల్లా వైసీపీ కార్యదర్శి (ఆక్టివిటీ)గా నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. సింగనమల నియోజవర్గ ఇన్‌ఛార్జ్ శైలజనాథ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి పదవి కేటాయించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News September 3, 2025
జిల్లాలో బీడు భూములు ఉండకూడదు: కలెక్టర్

అనంతపురం జిల్లాలో బీడు భూములు ఉండకూడదని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు. బీడు భూమిలో ఉద్యాన పంటలు, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ ఉండాలని చెప్పారు. ఏడు నియోజకవర్గాలలోని ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్తగా ఎంపిక చేసిన గ్రామాలకు వార్షిక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
News September 2, 2025
స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖలు పనిచేయాలి: కలెక్టర్

స్వయం సహాయక సభ్యులు, రైతు సంఘాల సభ్యులకు సుస్థిరమైన జీవనోపాధి, స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖల అధికారులు పని చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలన్నారు. లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు.
News September 2, 2025
రాయదుర్గం: మద్యం మత్తులో ప్యాంటు లేకుండా ఉద్యోగి

రాయదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజీ డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్న మధన్ మద్యం తాగి ఆసుపత్రిలోనే నిద్రించాడు. ఈ ఘటన చర్చనీయాంశమైంది. రోగులకు సేవలు అందించాల్సిన సమయంలో ఆఫీస్ వేళల్లోనే మద్యం తాగి ప్యాంటు లేకుండా బెడ్‌పై పడుకొని విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మధన్‌పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ ఆవుల మనోహర్ డిమాండ్ చేశారు.