News August 28, 2025
గణనాథునికి పూజలు నిర్వహించిన ADB ఎస్పీ

ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో భక్తిశ్రద్ధలతో గణనాథునికి ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని స్వయంగా మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించారు. గణపతి ఉత్సవాలను ప్రజలందరూ పోలీసుల సూచనలను పాటిస్తూ, వర్షం దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఏఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఇంద్రవర్ధన్ ఉన్నారు.
Similar News
News August 28, 2025
సీఐ ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్

జైనథ్ సీఐ సాయినాథ్‌ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. డొలారా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీఐ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆస్పత్రికి వెళ్లి సీఐ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దగ్గరుండి పలు వైద్య పరీక్షలను చేయించారు. సీఐతో పాటు గాయపడ్డ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
News August 28, 2025
సీఐ, డ్రైవర్ పరిస్థితిపై ఎస్పీ అరా

ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జైనథ్ మండలంలోని డొలారా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జైనథ్ సీఐ సాయినాథ్, డ్రైవర్ పరిస్థితిపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, డ్రైవర్‌ను ఎస్పీ స్వయంగా వెళ్లి పరామర్శించారు. డాక్టర్‌తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి ఉన్నారు.
News August 28, 2025
కొత్తపల్లిని రెవెన్యూ గ్రామంగా మారుస్తా: MP

నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామంగా మార్చుటకు కృషి చేస్తామని ఎంపీ గోడం నగేష్ హమిచ్చారు. గురువారం ఆదిలాబాదులోని ఆయన నివాసంలో గ్రామస్థులు ఎంపీను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తపల్లి గ్రామంలో ఉన్న శ్రీహనుమాన్ ఆలయానికి ప్రహరీ కోసం రూ.5 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో చౌహన్ దిగంబర్, గుణవంతరావు, శ్యామరావు, కేశవ్, దీపక్, ప్రవీణ్ నాయక్ తదితరులున్నారు.