News August 28, 2025
నేడు జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ అర్ధరాత్రి జపాన్‌కు బయలుదేరనున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో అక్కడ పర్యటించి 15వ ఇండియా-జపాన్ యాన్యువల్ సమ్మిట్‌లో పాల్గొంటారు. జపనీస్ PM ఇషిబాతో సమావేశమై ఇరు దేశాల దౌత్య, ట్రేడ్ సంబంధాలపై చర్చిస్తారు. 2018 తర్వాత మోదీ జపాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. 2014లో ఆయన PMగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు జపాన్‌లో పర్యటించారు.
Similar News
News August 28, 2025
HYDకి బీచ్ రాబోతోంది!

హైదరాబాద్‌లో త్వరలోనే బీచ్ అందుబాటులోకి రానుంది. నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 35 ఎకరాల్లో రూ.225కోట్ల వ్యయంతో డిసెంబర్ నుంచి దీని నిర్మాణం మొదలుకానుంది. బీచ్‌లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటివి చేర్చనున్నారు. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో అభివృద్ధి కానుంది.
News August 28, 2025
GALLERY: తీరొక్క రూపాల్లో కొలువుదీరిన గణపయ్య

తెలుగురాష్ట్రాల్లో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఊరూవాడా మండపాలతో శోభాయమానంగా మారాయి. ఆ గణపయ్య తీరొక్క రూపాల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు. పెద్ద విగ్రహాలు, వివిధ ఆకారాలు, అలంకారాలతో ఉన్న వినాయకుడి రూపాలు ప్రస్తుతం SMలో సందడి చేస్తున్నాయి. పెళ్లి కుమారుడిగా, మహా గణపతిగా, ఉయ్యాల్లో సేదతీరుతున్నట్లుగా ఇలా అనేక అవతారాల్లో ఆ గణేశుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు.
News August 28, 2025
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు: చంద్రబాబు

APలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారు. ఫ్యామిలీ బెన్ఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై CM సమీక్షించారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్‌లా ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని, అందరికీ లబ్ధి కలిగేలా స్కీంలు రీ-డిజైన్ చేసేలా చూడాలని చెప్పారు.