News August 28, 2025

సిరిసిల్ల: విద్యాసంస్థలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజలెవరూ వాగులు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లొద్దని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరంలో అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

Similar News

News August 28, 2025

నిజాంసాగర్: 27 గేట్లు ఎత్తి.. 2.20 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

image

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గురువారం రాత్రి 8 గంటలకు 1,80,038 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తి 2,20,256 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 15.847 టీఎంసీలకు చేరింది. నీటి ప్రవాహం పెరిగినందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News August 28, 2025

MBNR: మరికొద్దిరోజుల్లో పెళ్లి ఇంతలోనే విషాదం

image

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు కరెంట్ షాక్‌తో మృతి చెందిన విషాద ఘటన దేవరకద్ర మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చిన్న రాజమూరు వాసి అరుణ్ కుమార్ జిల్లా కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మరణించాడు. అరుణ్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయం అయింది.

News August 28, 2025

వైద్యం కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలి: కలెక్టర్

image

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం నరసాపురం మండలం తూర్పు తాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. పీహెచ్‌సీలోని మందులు, ల్యాబ్, స్టాప్ రూమును, పలు విభాగాలను తనిఖీ చేశారు. ఓపి రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పట్టి పరిశీలించారు. హాస్పటల్‌కు వచ్చిన రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వైద్యం కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలన్నారు