News August 28, 2025

ASF: 7 కాళ్లు, 2 కడుపుల గొర్రెపిల్ల జననం

image

పెంచికలపేట మండలం పోతపల్లిలో వింత గొర్రె పిల్ల జన్మించింది. డోకే కమలాకర్‌కు సంబంధించిన గొర్రె 7 కాళ్లు, రెండు కడుపులు, రెండు తోకలు, ఒక తలతో వింత గొర్రెపిల్ల పుట్టి మరణించిందని రైతు తెలిపారు. అది చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తిలకించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు వింతలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు.

Similar News

News August 28, 2025

రేపు కరీంనగర్ డ్యాం గేట్లు తెరిచే అవకాశం

image

కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిడ్ మానేరు నుంచి వరద లోయర్ మానేరు డ్యాంలోకి వస్తుందని, రేపు 10 గంటల వరకు స్పిల్వే వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని తెలిపారు. నది దిగువన గుండా పరిసర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానేరు నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.

News August 28, 2025

కోవూరు పోలీసుల కస్టడికీ అరుణ

image

రౌడీ షీటర్ ప్రియురాలు అరుణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బిల్డర్‌ను బెదిరించిన కేసులో ఆమెను అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈకేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు అరుణను మూడు రోజుల కస్టడికీ తీసుకున్నారు. ఒంగోలు జైలు నుంచి కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడే ఆమెను విచారించనున్నారు.

News August 28, 2025

US టారిఫ్స్‌కు GSTతో చెక్: BMI

image

ఇండియాపై US టారిఫ్స్ ప్రభావం పరిమితమేనని బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ అభిప్రాయపడింది. ‘ఈ దశాబ్దం చివరికి IND GDP 6%పైనే ఉంటుంది. 2010-19 యావరేజ్(6.5%)తో పోలిస్తే కొంతే తక్కువ. అయినా ASIAలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీస్‌లో INDనే టాప్. GST 2శ్లాబుల విధానం, ఆదాయపన్ను కోతలతో కొనుగోళ్లు రూ.5.31 లక్షల కోట్లకు చేరుతాయని SBI అంచనా. ఇవన్నీ గ్రోత్‌పై టారిఫ్స్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపింది.