News August 28, 2025

అంతర్గాం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అప్డేట్

image

అంతర్గాం(M) శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. 40 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

Similar News

News August 28, 2025

కరీంనగర్: కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల నియామకం

image

TG యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా నూతన కోఆర్డినేటర్ నియామకం గురువారం జరిగింది. కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా కడారి కుమార్, ముక్కెర సతీష్ కుమార్ లు నియామకమయ్యారు. అదేవిధంగా మల్లికార్జున్, ప్రశాంత్ లను కో-కో ఆర్డినేటర్లుగా నియమించారు. వీరితో పాటు 6 అసెంబ్లీ కోఆర్డినేటర్లను నూతనంగా ఎంపిక చేశారు. స్థానిక సంస్థల విజయం కోసం పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ప్రచారంలో నియామకాలు జరిగాయి.

News August 28, 2025

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

అధికారులు పాఠశాలల నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం వికారాబాద్‌లోని కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎంఈఓలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమాజాన్ని మార్చాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థులకు సరైన బోధన చేయాలని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని, దీని నిర్వహణ సక్రమంగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు.

News August 28, 2025

పరిగి: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణ ప్రాంతం పరిశీలన

image

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణ ప్రాంతాన్ని గురువారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సందర్శించారు. ప్రాజెక్ట్ ఎంత విస్తరణ ఎలా ఉంటుందో మ్యాప్‌లో పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. త్రివేణి సంగమంగా మూడు స్టోర్లను ఏర్పాటు చేసుకుని, రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 4 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించనున్నట్లు తెలిపారు.