News August 28, 2025

VJA: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP), చర్లపల్లి(CHZ) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.08579 VSKP- CHZ రైలును OCT 3 నుంచి NOV 28 వరకు ప్రతి శుక్రవారం, నెం.08580 CHZ- VSKP రైలును OCT 4 నుంచి NOV 29 వరకు ప్రతి శనివారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించారు.

Similar News

News August 28, 2025

నదుల అనుసంధానం చేస్తాం: ఆనం

image

AP: గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి CM చంద్రబాబు కట్టుబడి ఉన్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఇందుకోసం రూ.84వేల కోట్లతో ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. సముద్రంలోకి పోయే జలాలపై రాజకీయ లబ్ధి కోసం కొందరు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నుంచి వచ్చే జలాలను సోమశిల, కండలేరులో 150 TMCల చొప్పున నిల్వ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

News August 28, 2025

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మూలపురుషుడు ఎవరో తెలుసా?

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూలపురుషుడిగా ముక్త్యాల రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ పేరుగాంచారు. జగ్గయ్యపేట సంస్థానంలోని ముక్త్యాల సంస్థానాధీశుడైన ఆయన, నాటి దట్టమైన అడవి ప్రాంతమైన నందికొండలో సాగర్ ప్రాజెక్టు కోసం వేల ఎకరాల భూమిని దానం చేసి, రూ. లక్షలాది వెచ్చించారు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా పాలకులను ఒప్పించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కీలకపాత్ర పోషించారు.

News August 28, 2025

బాలకృష్ణ ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ 2’ మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ ఉండటంతో పోస్ట్‌పోన్ చేయక తప్పడం లేదని వివరించింది. తదుపరి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.