News August 28, 2025
ఈ ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద సైకిల్ ర్యాలీ

ఈ నెల 31న గచ్చిబౌలిలో సైక్లింగ్ ర్యాలీ జరుగనుంది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. ర్యాలీ ఆదివారం ఉ.7గం.కు గచ్చిబౌలి స్టేడియం మెయిన్ గేటు వద్ద ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు వేడుకకు హాజరవుతారని వివరించారు.
Similar News
News September 11, 2025
నిమ్స్‌లో వాట్సప్‌లోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

రోజురోజుకూ పేషెంట్లు రద్దీ పెరుగుతుండటంతో రోగులు ఇబ్బంది పడకుండా మెరుగైన సేవలు కల్పించేందుకు నిమ్స్ అధికారులు సిద్ధమయ్యారు. రిజిస్ట్రేషన్ వద్ద గంటల తరబడి వేచి చూడకుండా ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రానుంది. మరో వారం, పది రోజుల్లో వాట్సప్, ఆన్‌లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించి రోగులు వేచి ఉండకుండా చర్యలు తీసుకుంటామని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. కియోస్క్‌లు కూడా ఉపయోగిస్తారని తెలిపారు.
News September 11, 2025
రేపటి నుంచే పరీక్షలు.. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

పార్ట్ టైం PhD ప్రవేశ పరీక్షలు JNTUHలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు (14వ తేదీ వరకు) ఈ పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారంగా ఈ టెస్టులు నిర్వహించనున్నారు. దాదాపు 995 మంది ఎంట్రన్స్ టెస్టుకు హాజరవుతారని అధికారులు తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అడ్మిషన్స్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు.
News September 11, 2025
JNTUH: 18, 19 తేదీల్లో స్పాట్ అడ్మిషన్స్

JNTUHలో ఎంటెక్ (స్పాన్సర్డ్) సీట్ల కోసం ఈ నెల 18, 19 తేదీలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ర్టార్ తెలిపారు. ఫుల్ టైం ఎంటెక్ కోర్సుల్లో చేరాలనుకునే వారు అడ్మిషన్స్ కార్యాలయంలో ఉ.10 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. స్పెషలైజేషన్, అర్హతలు, స్పాన్సర్డ్ సర్టిఫికెట్ల వివరాలు, ట్యూషన్ ఫీజు తదితర పూర్తి వివరాల కోసం www.jntuh.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని వివరించారు.