News August 28, 2025

HYD: ఎవరూ చూడటంలేదని తోక జాడించకండి..!

image

గణేశ్ నవరాత్రుల సందర్భంగా మండపాలు, నిమజ్జనవేడుకల్లో యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పని పట్టేందుకు SHE టీమ్స్ సిద్ధమైంది. మూడు కమిషనరేట్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా పోకిరీలపై నిఘా వేశారు. ఎవరూ చూడటం లేదని తోకజాడించాలని చూస్తే వారి కదలికలన్నీ పసిగడతాం అని స్పష్టం చేశారు. ఎక్కడైనా పోకిరీలు ఇబ్బంది పెడితే 94906 17444, 949061655, 8712662111 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. 

Similar News

News August 28, 2025

ఓయూ: ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల రెండో సెమిస్టర్, రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
SHARE IT

News August 28, 2025

HYD: సోషల్ మీడియా పోస్టులు.. CP హెచ్చరిక

image

HYDలో వైభవంగా గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 6వ తేదీ వరకు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఉండరాదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News August 28, 2025

‘TRS’కు పురుడుపోసిన బషీర్‌బాగ్ దమనకాండ

image

నాడు TDP హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 2000 మే నెలలో రాష్ట్రమంతా ఉద్యమించింది. ఈ పరిణామాలతో నాటి Dy. స్పీకర్‌ KCR లేఖ ద్వారా ప్రభుత్వానికి అసంతృత్తి తెలుపుతూ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. పరోక్షంగా బషీర్‌బాగ్ దమనకాండ TRS పార్టీ పురుడుపోసుకోవడానికి ఓ కారణమైంది. నాడు పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ఈ ప్రాంతానికి కలిగే నష్టాన్ని ఆయన అసెంబ్లీలో ప్రసంగించి ప్రజల మన్నెనలు పొందారు.