News August 28, 2025
మూడు రోజులుగా ముసురు.. అయినా సాధారణ వర్షపాతమే..!

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ముసురు పడుతూనే ఉంది. ఈ వానతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. అయితే మూడు రోజులుగా సాధారణ వర్షపాతమే నమోదు అవుతోంది. ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాలేదు. గీసుగొండ, దుగ్గొండి, నెక్కొండ, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట, ఖానాపూర్, నల్లబెల్లి, చెన్నరావుపేట, సంగెం, వర్ధన్నపేట తదితర మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా వరంగల్, ఖిలావరంగల్‌లో తక్కువే పడింది.
Similar News
News August 28, 2025
WGL: గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

హనుమకొండ జిల్లాలోని వచ్చే నెల 5న నిర్వహించనున్న గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. హనుమకొండలోని కాజీపేట బంధం చెరువు, సిద్ధేశ్వర గుండం, హసన్‌పర్తి చెరువులను ఆయన సందర్శించి, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆయనతో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ట్రాఫిక్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.
News August 27, 2025
వరంగల్ జిల్లాలో దంచి కొడుతున్న వర్షం

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం దంచి కొడుతోం. ఆగస్టు 27న ఉ.8:30 నుంచి సా.4 వరకు 107.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 30.5 మి.మీ. వర్షం కురిసింది. దుగ్గొండి 23.8, ఖానాపూర్ 15.3 నమోదైంది. అతి తక్కువగా ఖిల్లా వరంగల్ మండలంలో 0.5 మి.మీ. నమోదైంది.
News August 27, 2025
గణపతి పల్లకి మోసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని

వేయి స్తంభాల గుడిలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య గణపతి మహారాజ్‌కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతికి నిర్వహించిన పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేయి స్తంభాల దేవాలయం చుట్టూ గణపతి పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పల్లకిని భుజాలపై మోశారు.