News August 28, 2025

NZB: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థల బంద్

image

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విధిగా సెలవు పాటించాలని సూచించారు. వర్షాల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టమన్నారు.

Similar News

News August 28, 2025

NZB: 7 పునరావాస కేంద్రాలు.. 164 కుటుంబాలు

image

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం చందూర్, ధర్పల్లి, డిచ్‌పల్లి, NZB రూరల్, జక్రాన్‌పల్లి మండలాల్లో 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డ తెలిపారు. అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. 164 కుటుంబాలకు చెందిన 358 మంది ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదన్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు.

News August 28, 2025

NZB: 12,413 ఎకరాల్లో పంట నష్టం: కలెక్టర్

image

జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, భీమ్‌గల్, ఇందల్వాయి మండలాల్లోని కొండాపూర్, తూంపల్లి, గడ్కోల్, ముషీర్ నగర్, హోన్నాజీపేట్, వాడి, నడిమితండా, బెజ్జోరా, సిర్నాపల్లి గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. పై ప్రాంతాల్లో మూడు చెరువులు తెగిపోగా, సుమారు 12,413 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు చెప్పారు. నీట మునగడం వల్ల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.

News August 28, 2025

NZB: ఇప్పటి వరకు జరిగిన నష్టం వివరాలు: కలెక్టర్

image

NZB జిల్లాలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 13 చోట్ల పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని, 29 చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లకు నష్టం జరిగిందని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. వర్షానికి ఓ నివాస గృహం పూర్తిగా కూలిపోయిందన్నారు. మరో ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 60 కరెంటు స్తంభాలు, మరో 60 కండక్టర్లు పడిపోయాయని చెప్పారు. కొన్ని చోట్ల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయని వెల్లడించారు.