News August 28, 2025

ఖమ్మం జిల్లాలో 24 గంటల్లో 1201.3 మి.మీ వర్షపాతం

image

ఖమ్మం జిల్లాలో నిన్న ఉదయం 8.30 గంటల నుంచి నేడు ఉదయం 6 గంటల వరకు 1201.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కొనిజర్లలో 95.1, YRP 92, వేంసూరు, KMM(R) 84.8, వైరాలో 84.1, రఘునాథపాలెంలో 82.4 మి.మీ. వర్షం పడింది. చింతకాని 74.2, కల్లూరు, SPL 57, ENKR 56, సింగరేణి 54, ఖమ్మం అర్బన్‌లో 51.8 మి.మీ.గా నమోదైందని జిల్లా సగటు వర్షపాతం 57.2 మి.మీ.గా ఉందన్నారు.

Similar News

News August 29, 2025

ఖమ్మం: డెంగీ ఏలిషా యంత్రాల టెండర్లకు ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాకు 5 డెంగీ ఏలిషా వాషర్, రీడర్ యంత్రాలను సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు DMHO కళావతి బాయి తెలిపారు. ఆసక్తిగల సరఫరాదారులు జిల్లా కలెక్టరేట్‌లోని వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఆగస్టు 31వ తేదీ లోపు తమ టెండర్లను సమర్పించాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 3 గంటలకు వాటిని ఫైనల్ చేయనున్నట్లు ఆమె వివరించారు.

News August 28, 2025

పగిడేరు వాగు వరద ఉద్ధృతిని పరిశీలించిన సీపీ

image

కొణిజర్ల మండలం లాలాపురం- తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని గురువారం సీపీ సునీల్ దత్ పరిశీలించారు. వరద తీవ్రతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమయమైన రోడ్లు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100, 1077కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించకుండా నిరోధించాలని ఆదేశించారు.

News August 28, 2025

ఖమ్మం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే 1077 లేదా 9063211298 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.