News August 28, 2025
విశాఖలో ముగ్గురు కీలక నేతల పర్యటన

విశాఖలో ముగ్గురు ముఖ్య నాయకులు 3 రోజులపాటు పర్యటించనున్నారు. మంత్రి నారా లోకేశ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విశాఖలో పర్యటిస్తూ, టీడీపీ కార్యాలయంలో బస చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 3 రోజుల పర్యటనలో పాల్గొననున్నారు. ఈనెల 29న సీఎం చంద్రబాబు విశాఖ రానున్నారు. ముగ్గురు నేతలు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీరి బందోబస్తుకి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News August 29, 2025
ఆరిలోవ: నడిరోడ్డుపై నిప్పంటిచుకున్నాడు

విశాఖలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిప్పంటిచుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఆరిలోవలో జరిగింది. ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండగానే తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు, 108కి సమాచారం అందిచారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతడిని 108లో KGHకి తరలించారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా ఈ అఘాయత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
News August 29, 2025
ఈసారి విశాఖ వస్తే మీ ఇంట్లోనే నిద్ర చేస్తా: పవన్

ఈసారి విశాఖ వస్తే మీ ఇంట్లోనే నిద్ర చేస్తా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కార్యకర్తను ఉద్ధేశించి మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. కార్యకర్తల ఇంటిలో ఒక రోజు నిద్ర చేసి వారి కష్టాలను తెలుసుకోవాలని గాజువాకకు చెందిన జనసేన కార్యకర్త సురేశ్ కుమార్ పవన్‌ను కోరారు. ఈ ఆలోచన నచ్చడంతో ఈసారి విశాఖ వస్తే సురేశ్ ఇంట్లోనే నిద్ర చేస్తానంటూ నిన్న జరిగిన సమావేశం అనంతరం పవన్ అన్నారు.
News August 29, 2025
విశాఖలో రాష్ట్రస్థాయి తెలుగు భాషా దినోత్సవం

విశాఖలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ హాజరుకానున్నారు. సిరిపురంలోని వుడా బాలల ప్రాంగణంలో రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గిడుగు రామ్మూర్తి పురస్కార విజేతలను సత్కరిస్తారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.