News August 28, 2025
HYD: గుర్తుంచుకోండి.. ఈ శనివారమే కౌన్సెలింగ్

రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ శనివారం 30న మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. NRI కోటాలో అగ్రి ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ(బీటెక్), బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్లు మిగిలిపోవడంతో ఈ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉ.10 గంటలకు హాజరుకావాలని రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. వివరాలకు pjtau.edu.in చూడాలన్నారు.
Similar News
News August 28, 2025
ఓయూ: ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల రెండో సెమిస్టర్, రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
SHARE IT
News August 28, 2025
HYD: సోషల్ మీడియా పోస్టులు.. CP హెచ్చరిక

HYDలో వైభవంగా గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 6వ తేదీ వరకు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఉండరాదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News August 28, 2025
‘TRS’కు పురుడుపోసిన బషీర్‌బాగ్ దమనకాండ

నాడు TDP హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 2000 మే నెలలో రాష్ట్రమంతా ఉద్యమించింది. ఈ పరిణామాలతో నాటి Dy. స్పీకర్ KCR లేఖ ద్వారా ప్రభుత్వానికి అసంతృత్తి తెలుపుతూ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. పరోక్షంగా బషీర్‌బాగ్ దమనకాండ TRS పార్టీ పురుడుపోసుకోవడానికి ఓ కారణమైంది. నాడు పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ఈ ప్రాంతానికి కలిగే నష్టాన్ని ఆయన అసెంబ్లీలో ప్రసంగించి ప్రజల మన్నెనలు పొందారు.