News August 28, 2025

హైదరాబాద్‌లో 1.40 లక్షల గణనాథుడి ప్రతిమలు

image

మహానగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బస్తీ, కాలనీ, గల్లీ తేడా లేకుండా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. నగర వ్యాప్తంగా 1.40 లక్షల విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు అధికారుల అంచనా. నిమజ్జనం జరిగే వరకు ప్రత్యేక కార్యక్రమాలు, అన్నదానాలు ఏర్పాటు చేసి నవరాత్రులను ఘనంగా జరుపుకోనున్నారు. శుక్రవారం నుంచి నిమజ్జనాల హడావుడి షురూ అవుతుంది.

Similar News

News August 29, 2025

బడా గణేశ్‌ని దర్శించుకున్న CP CV ఆనంద్

image

హైదరాబాద్ CP CV ఆనంద్ ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై అధికారుల నుంచి ఆరా తీశారు. అనంతరం ట్యాంక్‌బండ్ మీద నిమజ్జనం, పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

News August 28, 2025

ఓయూ: ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల రెండో సెమిస్టర్, రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
SHARE IT

News August 28, 2025

HYD: సోషల్ మీడియా పోస్టులు.. CP హెచ్చరిక

image

HYDలో వైభవంగా గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 6వ తేదీ వరకు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఉండరాదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.