News August 28, 2025

డేటింగ్ యాప్స్‌లో మహిళా యూజర్లే ఎక్కువ!

image

సాధారణంగా డేటింగ్ యాప్స్‌లో పురుషులే ఎక్కువగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఇండియాలోని డేటింగ్, మ్యాట్రిమోనియల్ సైట్స్, యాప్స్‌లో ఫీమేల్ యూజర్లే ఎక్కువ ఉన్నారని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్‌లో 57% మంది సబ్‌స్క్రైబర్లు మహిళలే అని చెప్పారు. 6 నెలలకు సబ్‌స్క్రిప్షన్ ఫీ రూ.57,459 ఉన్నప్పటికీ వారు వెనుకాడటం లేదని పేర్కొన్నారు.

Similar News

News August 28, 2025

VAD అంటే ఏంటి?

image

Vertebral artery dissection (VAD) అనేది వెన్నెముక ధమని లోపలి పొరల్లో సంభవించే చీలిక. ఈ ధమని మెదడుకు రక్త సరఫరా చేసే ప్రధాన రక్తనాళాల్లో ఒకటి. VAD వల్ల రక్త ప్రవాహం తగ్గి స్ట్రోక్ రావొచ్చు. హైబీపీ, స్మోకింగ్, మైగ్రేన్ లాంటి కారణాలతో VAD వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, బలహీనత, మాట్లాడేందుకు ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తాను VAD నుంచి కోలుకుంటున్నానని తెలంగాణ IAS <<17546623>>స్మిత<<>> ట్వీట్ చేశారు.

News August 28, 2025

రాష్ట్రంలో 4,472 విలేజ్ క్లినిక్‌లు: సత్యకుమార్

image

AP: రాష్ట్రంలో రూ.1,129 కోట్లతో 4,472 విలేజ్ క్లినిక్‌లు నిర్మిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. 80 శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని చెప్పారు. శ్రీకాకుళం-284, NDL-272, ఏలూరు-263, కోనసీమ-242, కృష్ణా-240, అల్లూరి-239, చిత్తూరు-229, బాపట్ల-211, మన్యం-205, ప్రకాశం, నెల్లూరు-203, అనకాపల్లి-200, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 100 M చొప్పున క్లినిక్‌లు నిర్మిస్తామన్నారు.

News August 28, 2025

మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు: జగన్

image

AP: ఉచిత బస్సు ప్రయాణం విషయంలో చంద్రబాబు మహిళలను వెన్నుపోటు పొడిచారని YS జగన్ ఆరోపించారు. ‘11,256 ఆర్టీసీ బస్సుల్లో కేవలం 6,700 బస్సుల్లోనే ఉచిత ప్రయాణమా? అమ్మఒడి తొలి ఏడాది ఇవ్వలేదు. 87 లక్షల మంది పిల్లల్లో 30 లక్షల మందికి ఇవ్వడం లేదు. మహిళలకు మేం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. ఉచిత సిలిండర్ల పథకానికి ₹4,100 కోట్లు అవసరమైతే ₹747 కోట్లే ఇచ్చారు. బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ’ అని Xలో జగన్ ఫైరయ్యారు.