News August 28, 2025
భారీ వర్షాలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. లోతట్టు ప్రాంతాలకు, నీరు ప్రవహిత ప్రాంతాలకు, వాగులు, చెక్ డ్యాముల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. చెట్ల క్రింద నిల్చోరాదని, కరెంటు వైర్స్ వద్ద నిలబడవద్దని, పాత ఇల్లు, షెడ్లు వంటి వాటిలో నివసించవద్దని అత్యవసర పరిస్థితుల్లో 100ను సంప్రదించాలని కోరారు.
Similar News
News August 29, 2025
అందుకే టాలీవుడ్‌కు దూరమయ్యా: కమలినీ ముఖర్జీ

ఆనంద్, గోదావరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ కమలిని ముఖర్జీ టాలీవుడ్‌కు దూరమై దశాబ్దం దాటింది. ఓ సినిమాలో పోషించిన పాత్ర తాను ఊహించిన స్థాయిలో తెరకెక్కకపోవడమే ఈ దూరానికి కారణమని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ క్యారెక్టర్‌పై అసంతృప్తి కలిగి తెలుగు చిత్రాల్లో నటించట్లేదని చెప్పారు. అయితే ఆ మూవీ పేరును వెల్లడించలేదు. చివరగా ఈ బ్యూటీ తెలుగులో ‘గోవిందుడు అందరివాడే’లో నటించారు.
News August 29, 2025
NZB: క్రీడా పోటీలు రద్దు

క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన వివిధ క్రీడా పోటీలను రద్దు చేస్తున్నట్లు DYSO (FAC) పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి 31 వరకు వెల్లడించిన షెడ్యూల్డ్‌లో భాగంగా 28, 29 తేదీల్లో నిర్వహించాల్సిన హాకీ, బాస్కెట్ బాల్ టోర్నమెంటును వర్షం కారణంగా రద్దు చేస్తున్నామన్నారు. క్రీడల నిర్వహణకు మైదానం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
News August 29, 2025
ADB: వినాయకుడిని దర్శించుకున్న గోమాత

భీంపూర్ మండలం అంతర్గాంలో త్రినేత్ర గణేష్ మండలి వద్ద హారతి తర్వాత ఓ విచిత్ర ఘటన జరిగింది. అటుగా వచ్చిన ఓ ఆవు, దాని దూడ వినాయకుడి విగ్రహం ముందు నిలబడి భక్తితో చూస్తున్నట్లు కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన అక్కడి యువకులు వాటికి నైవేద్యం సమర్పించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్వతి పుత్రుడు గణపతిని మురిపెంగా చూస్తూ ఆవు దూడలు అలా దర్శనం చేసుకుంటున్నట్లు కనిపించాయి.