News April 2, 2024

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే..

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోటీ చేయబోయే తమ అభ్యర్థలును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీరిలో దర్శి నుంచి కొండారెడ్డి, అద్దంకి నుంచి కిషోర్ బాబు, ఒంగోలు నుంచి రమేశ్ బాబు, కొండపి నుంచి సతీశ్, మార్కాపురం నుంచి షేక్ సైదా, గిద్దలూరు నుంచి పగడాల పెద్ద రంగస్వామి, కనిగిరి నుంచి కదిరి భవాని బరిలో నిలిచారు. ఈ మేరకు పీసీసీ ఛీఫ్ షర్మిలా ప్రకటన విడుదల చేశారు.

Similar News

News March 14, 2026

ఉమ్మడి ప్రకాశం: 10th విద్యార్థులకు SP సూచన

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ నెల 16 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 108 కేంద్రాల్లో 10 పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్షలు సజావుగా జరిగేందుకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏవైనా ఘటనలు జరిగితే డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.

News March 14, 2026

ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ రాజబాబు శనివారం తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, గ్యాస్ కొరత సృష్టించినా, అక్రమ నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఏర్పడితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 1077 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వినియోగదారులకు సూచించారు.

News March 14, 2026

కనిగిరి: పాపం.. ఈ కష్టం ఏ తల్లికీ రాకూడదు..!

image

ఇటీవల S.కొండలోని నవోదయ కోచింగ్ సెంటర్‌లో అనుమానాస్పద స్థితిలో కనిగిరికి చెందిన తౌషిక్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తౌషిక్ తల్లి మౌలాబి శుక్రవారం కొన్ని గంటలపాటు కనిపించకుండా పోయిందని బంధువులు ఆందోళన చెందారు. సాయంత్రం వేళలో శ్మశానవాటికలోని తౌషిక్ సమాధి వద్ద పడుకొని ఏడుస్తూ ఉండటం గమనించిన స్థానికులు ఆమెను వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ విషాద ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.