News April 2, 2024
ఎన్‌కౌంటర్: 9 మంది మావోయిస్టులు మృతి

ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 9కి చేరింది. గంగాలూరు పీఎస్ పరిధిలో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 9 మంది మావోయిస్టులు మరణించారు. తుపాకులతో పాటు భారీ ఎత్తున ఆటోమెటిక్ వెపన్స్ సీజ్ చేశారు.
Similar News
News April 11, 2026
IPLలో నేడు డబుల్ ధమాకా

IPLలో ఈరోజు 3.30PMకి చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా PBKS, SRH తలపడనున్నాయి. PBKSపై SRHకు మంచి రికార్డు ఉంది. రెండు జట్ల మధ్య 24 మ్యాచులు జరగగా సన్‌రైజర్స్ 17 గెలిచింది. దీంతో ఈరోజు మరో విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక 7.30PMకి చెన్నై వేదికగా CSK, DC మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడగా 19 విజయాలతో CSKదే పైచేయిగా ఉంది.
News April 11, 2026
ఎల్లుండి టెట్ నోటిఫికేషన్?

TG: రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 13న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో TET నిర్వహించారు. ఇప్పుడు రెండో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ రెండో వారంలో పరీక్షలు జరిగే అవకాశముంది.
News April 11, 2026
WTCలో మార్పులు.. ఇక నుంచి 12 జట్లు?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పలు మార్పులు జరిగే అవకాశముంది. 2027 నుంచి మొదలయ్యే WTC సైకిల్‌లో జట్ల సంఖ్యను 9 నుంచి 12కి పెంచాలని ICC వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించింది. కొత్తగా ZIM, IRE, AFGను చేర్చాలంది. కాగా ప్రస్తుతం కనీసం 2 మ్యాచుల సిరీస్‌ల ఫలితాలు WTC pts టేబుల్‌కి యాడ్ అవుతున్నాయి. ఇక నుంచి సింగిల్ టెస్ట్ సిరీస్‌ల ఫలితాలనూ యాడ్ చేయాలనుకుంటున్నారు. దీనిపై ICC తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


