News August 28, 2025
MTM: మెగా డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

మెగా డీఎస్సీలో అర్హత సాధించిన కృష్ణా జిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో జరిగింది. 1048 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. ఈ తనిఖీ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఎంఈఓ, రెవెన్యూ శాఖల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.
Similar News
News August 28, 2025
కృష్ణా: GST వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్లో GST అమలు తీరుపై సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో వస్తు సేవల పన్నుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆడిట్ పేరాల వివరాలను సంబంధిత ఆడిటర్ అధికారి వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలన్నారు.
News August 27, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు
☞ కృష్ణా జిల్లాలో వర్షానికి నష్టపోయిన చిరు వ్యాపారులు
☞ హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత
☞ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కృష్ణాజిల్లా ఉపాధ్యాయులు
☞ ఈనెల 30ను గుడివాడలో జాబ్ మేళా
News August 27, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ పేర్ని నానిపై ఏలూరు పోలీసుల కేసు నమోదు
☞ మచిలీపట్నం: సులభతర వాణిజ్యంపై కలెక్టర్ వర్క్ షాప్
☞ కృష్ణా జిల్లాలో వేగవంతంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
☞ మచిలీపట్నం- నరసాపురం జాతీయ రహదారిపై ప్రమాదం
☞ అవనిగడ్డ: పడవలో మృతదేహం
☞ మచిలీపట్నంలో జనసేన నేత సస్పెండ్