News August 28, 2025
MHBD: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం ఉదయం అన్ని శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాలు, గ్రామాలలో వర్ష సూచనలపై అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రజలకు విస్తృత ప్రచారం (టామ్ టామ్), స్థానిక వాట్సప్ గ్రూపుల ద్వారా అందించి అప్రమత్తం చేయాలన్నారు. ఎలాంటి పశుసంపద, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News August 29, 2025
క్రీడా ప్రపంచానికే హైదరాబాద్ వేదిక కావాలి: రేవంత్

తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉన్నట్లుగానే క్రీడా సంస్కృతి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలని స్పోర్ట్స్ హబ్ బోర్డ్ <<17546114>>సమావేశంలో<<>> అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తాము క్రీడా రంగానికి బడ్జెట్ 16 రెట్లు పెంచామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఆటగాళ్లకు ప్రోత్సాహాకాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
News August 29, 2025
వరంగల్: ఇంటర్ పూర్తి చేసిన వారికి శుభవార్త

HCL టెక్నాలజీస్ ఆధ్వర్యంలో HCL TECH Bee జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. 2024-2025లో ఇంటర్ పూర్తి చేసుకున్న వారు MPC, MEC, CEC, BIPC, Vocational Computers పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన హనుమకొండలోని ICSS కంప్యూటర్ ఎడ్యుకేషన్‌లో జాబ్ మేళా ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
News August 29, 2025
సోషల్ మీడియా కుట్రలను తిప్పికొట్టాలి: పవన్ కళ్యాణ్

AP: దేశ చరిత్రలోనే జనసేన విజయం ఓ మైలురాయి అని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. నిజాయితీ గల జనసైనికులు, వీర మహిళలే పార్టీకి ఇంధనమని చెప్పారు. సోషల్ మీడియాలో కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 15 ఏళ్లు ఏ పదవీ లేకుండా ఉన్నానని, జనసేన అంటేనే పోరాటాలకు స్ఫూర్తి అని చెప్పారు. కూటమి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.