News August 28, 2025
HYD: గౌరీపుత్రుడు గంగను చేరేందుకు 78 స్పాట్లు

నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో గణనాథులను ప్రతిష్టించారు. ఇక లక్షల సంఖ్యలో ఇళ్లల్లో వినాయకులు కొలువు దీరారు. ఇన్ని విగ్రహాలు చెరువుల్లో నిమజ్జనం చేయాలంటే కష్టం. అందుకే GHMC అధికారులు 78 చోట్ల కృత్రిమ, తాత్కాలిక చెరువులు ఏర్పాటు చేసింది. 29 చోట్ల బేబీ పాండ్స్, 28 చోట్ల పోర్టబుల్ పాండ్స్ సిద్ధం చేసింది. ఇక 21 ప్రాంతాల్లో తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేశారు.
Similar News
News August 29, 2025
HYD: హైడ్రా చర్యలను కొనియాడిన హై కోర్టు

రోడ్ల ఆక్రమణలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ప్రయత్నాలను హై కోర్టు జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి కొనియాడారు. రాంనగర్ క్రాస్‌రోడ్స్ వద్ద రోడ్ల ఆక్రమణలపై దాఖలైన PIL విచారణ సందర్భంగా ప్రజా రోడ్లు, పార్కులను కాపాడటంలో హైడ్రా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అధికారులు, ప్రజల ఉమ్మడి బాధ్యతని పేర్కొన్నారు.
News August 29, 2025
HYD: ఇదేం సై‘కిల్లింగ్’.. భాయ్!

ఇవాళ ఉదయం సైకిల్‌పై పనికి వెళ్లే ఇద్దరికి ఓ బైకిస్ట్ ఇలా లిఫ్ట్ ఇచ్చాడు. అబిడ్స్‌లో ఓ చోట పనిచేయడానికి మలక్‌పేట్ పరిసర ప్రాంతాల నుంచి వారిద్దరు నిత్యం సైకిల్‌పై వెళ్తుంటారు. కాగా ఓ బైకర్ ఇలా లిఫ్ట్ ఇవ్వడంతో 20-25నిమిషాల సైకిల్ జర్నీ 10MINలో పూర్తైందని చెబుతున్నారు. ఇలాంటి సహసాలు చేస్తే ఇతర ప్రయాణికులకూ ప్రమాదమని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
News August 29, 2025
HYD: సీఎస్ పదవీకాలం 7నెలలు పొడిగింపు

తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం 7నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన 2026 మార్చి వరకు CSగా కొనసాగనున్నారు. కాగా 2025 మేలో ఆయనను తెలంగాణ CSగా ప్రభుత్వం సిఫారసు చేయగా.. కేంద్రం ఆమోదించింది. ఆయన పదవీకాలం ఈనెల 31తో ముగియనుండగా.. మరి కొంతకాలం పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల లేఖ రాయగా దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.