News August 28, 2025

US స్టూడెంట్ వీసా నాలుగేళ్లకే పరిమితం!

image

US వీసాలు దుర్వినియోగం కాకుండా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలకు సిద్ధమైంది. స్టూడెంట్(F), ఎక్స్చేంజ్(J) వీసాలను ఇక నుంచి నాలుగేళ్లకే పరిమితం చేయాలని ప్రతిపాదించింది. ఓపెన్ ఎండెడ్ రూల్ వల్ల చాలామంది USలోనే ఉండిపోతున్నారని పేర్కొంది. కొత్త రూల్‌తో ఆ వీలుండదని తెలిపింది. మరోవైపు ఇతర దేశస్థుల జర్నలిస్ట్ వీసా(I)లను 240 రోజులు, చైనా జర్నలిస్ట్ వీసాలను 90 రోజులకే కుదించాలని ప్రపోజ్ చేసింది.

Similar News

News August 29, 2025

ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

image

టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) డైరెక్టర్ శ్రీహరి రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 22-28 వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30-సా.5.30 గంటల వరకు ఉండనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 13 వరకు ఉంటాయని ఆయన వెల్లడించారు. పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 29, 2025

నవంబర్ 15లోగా MSME పార్కులు ఏర్పాటు కావాలి: CBN

image

AP: రాష్ట్రంలో ఏరో స్పేస్, IT, ఫుడ్ ప్రాసెసింగ్, MSME రంగాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ₹53,922 కోట్లు ఇన్వెస్ట్ చేసే 30 ప్రాజెక్టులను సీఎం ఆధ్వర్యంలోని పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) ఆమోదించింది. అన్ని నియోజకవర్గాల్లో నవంబర్ 15లోగా MSME పార్కులు ఏర్పాటు కావాలని CM ఆదేశించారు. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

News August 29, 2025

క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ప్లేయర్లు

image

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్ నం.2 వాంగ్‌(చైనా)పై సింధు వరుస సెట్లలో 21-19, 21-15 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. మెన్స్ డబుల్స్‌లో చిరాగ్, సాత్విక్ ద్వయం చైనా జోడీ లియాంగ్, వాంగ్‌ చాంగ్‌పై జయకేతనం ఎగురవేశారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్, తనీశా క్వార్టర్స్ దూసుకెళ్లారు. మరోవైపు రౌండ్-2లోనే లక్ష్యసేన్ పోరు ముగిసింది.