News August 28, 2025

ములుగు జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ములగు జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. వాగులు, వంకలు, కాజ్‌వేలు దాటొద్దని హెచ్చరించారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న రోడ్లను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 18004257109కి కాల్ చేయవచ్చని తెలిపారు.

Similar News

News August 29, 2025

ఇండస్ట్రీకి ఓ సూపర్ హిట్ కావాలి

image

జనవరిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఈ ఏడాది టాలీవుడ్‌లో రాలేదు. ‘కోర్టు’ చిన్న సినిమాల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. కుబేర, తండేల్, మ్యాడ్ స్క్వేర్, హిట్-3 వంటి చిత్రాలు పర్వాలేదనిపించినా బాక్సాఫీసును షేక్ చేయలేకపోయాయి. దీంతో వచ్చే నెలలో రానున్న ‘OG’పైనే ఆశలు నెలకొన్నాయి. సినిమా‌కు పాజిటివ్ టాక్ పడితే కాసుల వర్షం కురవనుంది. తేజా ‘మిరాయ్’ కూడా ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది.

News August 29, 2025

ఓకే పాఠశాలకు చెందిన ఏడుగురికి టీచర్ ఉద్యోగాలు

image

మహానంది మండ‌లం గోపవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు టీచ‌ర్ ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఐదుగురికి ఎస్టీజీ, ఇద్దరికి పీఈటీ పోస్టులు వచ్చాయి. త‌మ త‌ల్లిదండ్రులు క‌ష్ట‌ప‌డి చదివించార‌ని, వారి క‌ష్టం వృథా కాలేద‌ని టీచ‌ర్ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు పేర్కొన్నారు. వీరిని పాఠశాల పూర్వ ఉపాధ్యాయుడు పి.నాగశేషుడు, గ్రామ‌స్థులు అభినందించారు.

News August 29, 2025

ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

image

టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) డైరెక్టర్ శ్రీహరి రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 22-28 వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30-సా.5.30 గంటల వరకు ఉండనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 13 వరకు ఉంటాయని ఆయన వెల్లడించారు. పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.