News August 28, 2025

ప్రకాశం: క్రీడా ప్రతిభ అవార్డులకు ఎంపికైన పాఠశాలలు ఇవే.!

image

జిల్లాలో ఈనెల 29న నిర్వహించే విజార్డ్ ఆఫ్ ద హాకీ ఈవెంట్‌కు క్రీడా ప్రతిభ అవార్డులను అందించేందుకై 5 పాఠశాలలను ఎంపిక చేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం డీఈవో విడుదల చేసిన ప్రకటన మేరకు.. గొట్ల గట్టు జడ్పీహెచ్ఎస్ మొదటి స్థానంలో, గురవాజిపేట జడ్పీహెచ్ఎస్ 2వ స్థానం, పాకల జడ్పీహెచ్‌ఎస్ 3వ స్థానం, చిర్రీకూరపాడు జడ్పీహెచ్ఎస్ 4వ స్థానం, ఈతముక్కల జడ్పీహెచ్ఎస్ 5వ స్థానంలో నిలిచాయి.

Similar News

News August 29, 2025

ప్రకాశం: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్!

image

ప్రకాశం జిల్లాలో మెగా డీఎస్సీలో PHC కేటగిరి కింద ఎంపికైన అభ్యర్థులకు ఒంగోలు చెరువుకొమ్ముపాలెం వద్ద ఉన్న సరస్వతి జూనియర్ కళాశాలలో దరఖాస్తుల పరిశీలన నిర్వహిస్తామని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు తమ దివ్యాంగత్వం ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలు జీజీహెచ్, పీహెచ్సీహెచ్1 పత్రాలు కలిగిన విశాఖపట్నం ENT వైద్యశాలకు శుక్రవారం వెళ్లాలని కోరారు.

News August 29, 2025

దొనకొండ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూమి సిద్ధం

image

దొనకొండ మండలం బాధాపురంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి 2,149 ఎకరాల భూములను ఇప్పటికే గుర్తించినట్లు జేసీ గోపాలకృష్ణ వెల్లడించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సాగుకు అవసరమైన స్థాయిలో యూరియా అందుబాటులో ఉన్న విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

News August 28, 2025

పటిష్ఠంగా వెరిఫికేషన్ చేయండి: ప్రకాశం జేసీ

image

ఒంగోలు రూరల్ పరిధిలోని శ్రీసరస్వతి జూనియర్ కళాశాలను జేసీ గోపాలకృష్ణ సందర్శించారు. డీఎస్సీ-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పటిష్ఠంగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట డీఈవో కిరణ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.