News August 28, 2025

ఎల్లంపల్లి: హరీశ్‌రావు, KTR చెప్పినట్లు చేస్తే అంతే ఇగ: CM

image

‘గోదావరి జలాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ, జంక్షన్ లాంటిది. సాంకేతిక సలహాలు తీసుకుని ప్రాజెక్టుకు రిపేర్ చేస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను నాణ్యతా లోపంతో కట్టారు. అవి కూలుతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. తామైతే లోపలికి వెళ్లి చూడలేదు. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని తెలిసింది. హరీశ్‌రావు, KTR చెప్పినట్లు చేస్తే ఊళ్లకు ఊళ్లు మునుగుతాయి’అని CM రేవంత్ రెడ్డి అన్నారు.

Similar News

News August 29, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తాం: కలెక్టర్

image

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్‌లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ పాల్గొన్నారు.

News August 29, 2025

సీఎం పర్యటన మళ్లీ వాయిదా

image

సీఎం బెండాలపాడు పర్యటన వాయిదాలు పడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ నెల 21న ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడింది. తిరిగి 30న ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రకటించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ ఎర్పాట్లు ముమ్మరం చేశారు. 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో పర్యటన వాయిదాపడింది. తిరిగి సెప్టెంబర్‌లో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

News August 29, 2025

SKLM: 30న ఉద్యోగ మేళాకు ఇంటర్వ్యూలు

image

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా జరగనుంది. ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు జిల్లాఉపాధి కల్పనా అధికారి సుధ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ ఇండియా, గోడ్రెజ్ ఇండియా, డివిస్ లాబ్స్, సీల్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రైవేట్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.