News August 28, 2025
US టారిఫ్స్‌కు GSTతో చెక్: BMI

ఇండియాపై US టారిఫ్స్ ప్రభావం పరిమితమేనని బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ అభిప్రాయపడింది. ‘ఈ దశాబ్దం చివరికి IND GDP 6%పైనే ఉంటుంది. 2010-19 యావరేజ్(6.5%)తో పోలిస్తే కొంతే తక్కువ. అయినా ASIAలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీస్‌లో INDనే టాప్. GST 2శ్లాబుల విధానం, ఆదాయపన్ను కోతలతో కొనుగోళ్లు రూ.5.31 లక్షల కోట్లకు చేరుతాయని SBI అంచనా. ఇవన్నీ గ్రోత్‌పై టారిఫ్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపింది.
Similar News
News August 29, 2025
అందుకే టాలీవుడ్‌కు దూరమయ్యా: కమలినీ ముఖర్జీ

ఆనంద్, గోదావరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ కమలిని ముఖర్జీ టాలీవుడ్‌కు దూరమై దశాబ్దం దాటింది. ఓ సినిమాలో పోషించిన పాత్ర తాను ఊహించిన స్థాయిలో తెరకెక్కకపోవడమే ఈ దూరానికి కారణమని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ క్యారెక్టర్‌పై అసంతృప్తి కలిగి తెలుగు చిత్రాల్లో నటించట్లేదని చెప్పారు. అయితే ఆ మూవీ పేరును వెల్లడించలేదు. చివరగా ఈ బ్యూటీ తెలుగులో ‘గోవిందుడు అందరివాడే’లో నటించారు.
News August 29, 2025
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెంచనున్న భారత్

అమెరికా టారిఫ్ ఆంక్షలు విధించినా భారత్ మాత్రం వెనుకడుగు వేయట్లేదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు మరింత పెంచేందుకు సిద్ధమైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఆగస్టుతో పోల్చితే వచ్చే నెలలో 10-20% అదనంగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ దాడులతో మాస్కోలో రిఫైనరీలు దెబ్బతినగా ధరలు కూడా తగ్గే అవకాశమున్నట్లు సమాచారం. పశ్చిమదేశాల ఆంక్షలతో రష్యాకు భారత్ అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారుగా మారింది.
News August 29, 2025
ఆగస్టు 29: చరిత్రలో ఈ రోజు

1863 : తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి జననం(ఫొటో)
1905 : భారత హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జననం(ఫొటో)
1923 : భారత మాజీ క్రికెటర్ హీరాలాల్ గైక్వాడ్ జననం
1928 : నటి, గాయని రావు బాలసరస్వతీ దేవి జననం
1958 : మైకల్ జాక్సన్ జననం
1959: అక్కినేని నాగార్జున జననం
2018 : నందమూరి హరికృష్ణ మరణం
* తెలుగు భాషా దినోత్సవం
* జాతీయ క్రీడా దినోత్సవం