News August 28, 2025
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మూలపురుషుడు ఎవరో తెలుసా?

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూలపురుషుడిగా ముక్త్యాల రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ పేరుగాంచారు. జగ్గయ్యపేట సంస్థానంలోని ముక్త్యాల సంస్థానాధీశుడైన ఆయన, నాటి దట్టమైన అడవి ప్రాంతమైన నందికొండలో సాగర్ ప్రాజెక్టు కోసం వేల ఎకరాల భూమిని దానం చేసి, రూ. లక్షలాది వెచ్చించారు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా పాలకులను ఒప్పించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కీలకపాత్ర పోషించారు.
Similar News
News August 29, 2025
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తాం: కలెక్టర్

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్‌లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ పాల్గొన్నారు.
News August 29, 2025
సీఎం పర్యటన మళ్లీ వాయిదా

సీఎం బెండాలపాడు పర్యటన వాయిదాలు పడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ నెల 21న ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడింది. తిరిగి 30న ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రకటించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ ఎర్పాట్లు ముమ్మరం చేశారు. 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో పర్యటన వాయిదాపడింది. తిరిగి సెప్టెంబర్‌లో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
News August 29, 2025
SKLM: 30న ఉద్యోగ మేళాకు ఇంటర్వ్యూలు

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా జరగనుంది. ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు జిల్లాఉపాధి కల్పనా అధికారి సుధ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ ఇండియా, గోడ్రెజ్ ఇండియా, డివిస్ లాబ్స్, సీల్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రైవేట్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.