News August 28, 2025

కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి: మంత్రి అచ్చెన్న

image

కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని మంత్రి అచ్చెన్నాయుడు దేవాద‌య శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రానున్న నెల 23 నుంచి 25 వ‌ర‌కు జ‌ర‌గనున్న పండ‌గ మహోత్సవం నేప‌థ్యంలో గురువారం నిమ్మాడ కార్యాల‌యంలో జాత‌ర ఏర్పాట్ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Similar News

News February 5, 2026

శ్రీకాకుళం: నకీలి పాసుల కథ నడిపించిందెవరు?

image

అరసవల్లి రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీటి ముద్రణపై SM ఇన్‌ఫ్లుయోన్సర్ల పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను వారు ఖండించారు. తాజాగా ఆలయానికి సమీప జిరాక్స్ షాపుల్లోనే ఈ ముద్రణ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. వేడుకల్లోని కార్యక్రమాలకు వేల సంఖ్యలో పుట్టుకొచ్చిన పాసులకు బాధ్యులెవరో(SM ఇన్‌ఫ్లుయోన్సర్ల? జిరాక్స్ షాపుల? ఇతరుల?) బయటపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 5, 2026

ఎచ్చెర్ల: సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూలను ఆ విభాగం అధికారి డాక్టర్ ఎస్. ఉదయ భాస్కర్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఎగ్జామ్స్ ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు గమనించాలని అన్నారు.