News August 28, 2025
మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

ఉండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని మందుల స్టాక్, రికార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అదించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. తహశీల్దార్ నాగార్జున, డాక్టర్ సునంద ఆమెతో ఉన్నారు.
Similar News
News September 7, 2025
పెదతాడేపల్లి గురుకుల పాఠశాల పీజీటీ సస్పెండ్

తాడేపల్లిగూడెం (M) పెదతాడేపల్లి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పీజీటీ భీమడోలు రాజారావును జిల్లా కలెక్టర్ నాగరాణి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు చెందిన బ్యాగ్ పైపర్ బ్యాండ్ విద్యార్థుల బృందాన్ని నరసాపురంలోని ఒక ప్రైవేట్ కళాశాలకు తీసుకెళ్లినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే, జిల్లా కోఆర్డినేటర్ ఉమా కుమారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
News September 6, 2025
పెదఅమిరం: ఆధార్ బయోమెట్రిక్ ప్రక్రియ వేగవంతం చేయాలి

కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, ఈపీటీఎస్ ఫైల్స్ అప్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తల్లికి వందనం ఖాతాలో నగదు జమకు ఉన్న ఆటంకాలను పరిష్కరించాలన్నారు. పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ ను అప్డేట్ చేయాలని సూచించారు.
News September 6, 2025
కాళ్ళకూరు: ‘దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలి’

ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో ఉన్న శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఆలయం ప్రాంగణంలో జరిగింది. దేవస్థానం ఛైర్మన్‌గా వేగేశ్న రామ్మూర్తిరాజు, సభ్యులతో ఆకివీడు గ్రూపు దేవాలయాల ఈఓ అల్లూరి సత్యనారాయణరాజు ప్రమాణ స్వీకారం చేయించారు.