News August 28, 2025

దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్‌

image

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై గురువారం ఆమె ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2017 నుంచి ఇప్పటి వరకు 33,600 మరణాలు సంభవించినప్పటికీ, ఈ పథకం కింద కేవలం 3,121 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని కలెక్టర్ అన్నారు. దరఖాస్తుల సంఖ్య మరింత పెరగాలని ఆమె సూచించారు.

Similar News

News August 29, 2025

మర్డర్ కేసు ఛేదించిన నల్గొండ పోలీసులు

image

NLGలో జరిగిన <<17539485>>మర్డర్ <<>>కేసును వన్ టౌన్ CI ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బృందం 24 గంటలు గడవకముందే ఛేదించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ క్లీనర్ షేక్ సిరాజ్.. రమేశ్‌ను హత్య చేసినట్లు DSP శివరాంరెడ్డి వెల్లడించారు. సిరాజ్ రోజూ పడుకునే ప్లేస్‌లో రమేశ్ పడుకోవడంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ బండరాళ్లతో కొట్టి హత్య చేశాడన్నారు. కేసు ఛేదించిన బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

News August 29, 2025

NLG: నైపుణ్య విద్య.. రేపటి వరకే చాన్స్!

image

గ్రామీణ విద్యార్థుల్లో సాంకేతిక ప్రతిభను వెలికి తీసేందుకు నల్గొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నైపుణ్య విద్యలో శిక్షణ పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పించింది. రేపటి వరకు చాన్స్ ఉన్నందున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ కోరుతున్నారు.

News August 29, 2025

NLG: సెప్టెంబర్ 4 వరకు పింఛన్ల పంపిణీ

image

జిల్లాలో చేయూత పింఛన్లను సెప్టెంబర్ 4వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్టు తెలిపారు. పెన్షన్ దారులంతా రూ.16 చిల్లరను అడిగి తీసుకోవాలని పేర్కొన్నారు. మధ్య దళారులను నమ్మకూడదని సూచించారు.