News August 28, 2025
రేపు హాల్‌టికెట్లు విడుదల

APలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల హాల్‌టికెట్లు రేపు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 7న ఈ పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకోవాలని, హాల్‌టికెట్లను APPSC <
Similar News
News August 29, 2025
విద్యాశాఖ నివేదిక.. కోటి దాటిన టీచర్ల సంఖ్య

దేశంలో టీచర్ల సంఖ్య కోటి దాటినట్లు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదికలో కేంద్ర విద్యాశాఖ తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరంలో టీచర్ల సంఖ్య 98,07,600 కాగా, 2024-25లో 1,01,22,420కి చేరింది. ఒకే టీచరున్న స్కూల్స్ 1,04,125, ఒక్క విద్యార్థీ లేని పాఠశాలలు దేశంలో 7,993 ఉన్నాయి. అత్యధిక టీచర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఫస్ట్ UP ఉండగా.. TG 10, AP 12వ స్థానంలో ఉన్నాయి.
News August 29, 2025
OTTలోకి ‘మొగలిరేకులు’ సాగర్ మూవీ

మొగలిరేకులు ఫేమ్ RK సాగర్ హీరోగా ‘ది 100’ మూవీ జులై 11న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ మూవీ సడెన్‌గా OTTలో ప్రత్యక్షమైంది. ఇదే విషయాన్ని డైరెక్టర్ కూడా సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘ది 100 చిత్రం వరల్డ్ వైడ్‌గా అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది’ అంటూ పోస్ట్ పెట్టారు.
News August 29, 2025
అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నా: జేడీ వాన్స్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో ‘టెర్రిబుల్ ట్రాజెడీ’ సంభవిస్తే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ట్రంప్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కాగా ఇటీవల వైట్‌హౌస్‌లో మీడియా సమావేశానికి వచ్చిన ట్రంప్ చేతిపై గాయాలు కనిపించాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.