News August 28, 2025

US సాఫ్ట్‌ డ్రింక్స్ బహిష్కరిద్దామంటూ నెట్టింట చర్చ

image

టారిఫ్స్‌ పెంచి భారత్‌ను ఇబ్బంది పెడుతోన్న అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే <<17536241>>LPUలో<<>> US సాఫ్ట్ డ్రింక్స్‌ను బ్యాన్ చేశారు. ఇలాంటి నిర్ణయాన్నే దేశమంతా తీసుకుని అగ్రరాజ్యానికి బుద్ధి చెప్పాలనే అభిప్రాయం వినిపిస్తోంది. స్వదేశీ ప్రొడక్ట్‌లు వాడాలని, టారిఫ్స్ తగ్గించకపోతే USకు చెందిన సోషల్ మీడియా యాప్స్, మొబైల్స్‌ను కూడా ఇదే విధంగా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.

Similar News

News January 3, 2026

వరి ఉత్పత్తిలో చైనాను దాటేసిన భారత్.. ఎలా సాధ్యమైందంటే?

image

చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ 152 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో భారత్ ప్రపంచంలోనే No.1 స్థానానికి చేరింది. చైనాను దాటేయడంలో.. తైవాన్ ఇచ్చిన పొట్టి రకం (TN1) విత్తనాలు మన సాగును మలుపు తిప్పాయి. వీటికి తోడు IR-8, మన దేశీ రకం ‘జయ’ రాకతో ఉత్పత్తి భారీగా పెరిగింది. ఈ రకాలు నీటి ఎద్దడిని తట్టుకుని నిలబడగలిగాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలకు రైతుల కష్టం తోడవ్వడంతో భారత్ ‘రైస్ కింగ్’గా అవతరించింది.

News January 3, 2026

ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్, ముంబైలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>మెడికల్ కాలేజీ& హాస్పిటల్, అంధేరి ఈస్ట్, ముంబై 28 Sr. రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు జనవరి 9, 12, 13తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. పోస్టును బట్టి MBBS, MD/ MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అనస్తీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, EYE, పీడియాటిక్స్, సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, ICU, NICU, PICU, కార్డియాలజీ, అంకాలజీ విభాగంలో పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: esic.gov.in

News January 3, 2026

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ ధర రూ.380 తగ్గి రూ.1,35,820కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.350 తగ్గి రూ.1,24,500 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.4000 తగ్గి రూ.2,56,000కు చేరింది. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ ధర రూ.1,35,970గా ఉండగా, కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలుగా ఉంది.