News August 28, 2025
NZB: ఇప్పటి వరకు జరిగిన నష్టం వివరాలు: కలెక్టర్

NZB జిల్లాలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 13 చోట్ల పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని, 29 చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లకు నష్టం జరిగిందని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. వర్షానికి ఓ నివాస గృహం పూర్తిగా కూలిపోయిందన్నారు. మరో ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 60 కరెంటు స్తంభాలు, మరో 60 కండక్టర్లు పడిపోయాయని చెప్పారు. కొన్ని చోట్ల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయని వెల్లడించారు.
Similar News
News August 29, 2025
నిజామాబాద్: రాష్ట్రంలోనే టాప్ తూంపల్లి

నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. సిరికొండ మండలం తూంపల్లిలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. వాగులు వంకలు పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి.
News August 29, 2025
NZB: బేస్‌బాల్ నేషనల్స్‌కు జీజీ కాలేజ్ విద్యార్థులు

జాతీయ స్థాయి బేస్ బాల్ ఛాంపియన్షిప్‌కు గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.బాలమణి తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన మహిళల జట్టులో జి.శృతి, పురుషుల జట్టులో కే.సాయికుమార్ ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 29 నుంచి మహారాష్ట్రలోని అమరావతిలో జరిగే 38వ సీనియర్ నేషనల్ బేస్ బాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు.
News August 29, 2025
NZB: ఓటరు జాబితా ముసాయిదా ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని NZB, BDN, ARMR డివిజన్లలోని 31 మండలాల్లో ఉన్న 545 GPలు, 5,022 వార్డులు, 5,053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.