News August 28, 2025

NZB: 7 పునరావాస కేంద్రాలు.. 164 కుటుంబాలు

image

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం చందూర్, ధర్పల్లి, డిచ్‌పల్లి, NZB రూరల్, జక్రాన్‌పల్లి మండలాల్లో 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డ తెలిపారు. అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. 164 కుటుంబాలకు చెందిన 358 మంది ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదన్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు.

Similar News

News August 29, 2025

నిజామాబాద్: రాష్ట్రంలోనే టాప్ తూంపల్లి

image

నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. సిరికొండ మండలం తూంపల్లిలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. వాగులు వంకలు పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి.

News August 29, 2025

NZB: బేస్‌బాల్ నేషనల్స్‌కు జీజీ కాలేజ్ విద్యార్థులు

image

జాతీయ స్థాయి బేస్ బాల్ ఛాంపియన్షిప్‌కు గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.బాలమణి తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన మహిళల జట్టులో జి.శృతి, పురుషుల జట్టులో కే.సాయికుమార్ ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 29 నుంచి మహారాష్ట్రలోని అమరావతిలో జరిగే 38వ సీనియర్ నేషనల్ బేస్ బాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు.

News August 29, 2025

NZB: ఓటరు జాబితా ముసాయిదా ప్రకటన

image

స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని NZB, BDN, ARMR డివిజన్లలోని 31 మండలాల్లో ఉన్న 545 GPలు, 5,022 వార్డులు, 5,053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.