News August 28, 2025

సెప్టెంబర్ 7న తాత్కాలికంగా తిరుమల ఆలయం మూసివేత

image

AP: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూసి, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 8న ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Similar News

News August 29, 2025

ఇండస్ట్రీకి ఓ సూపర్ హిట్ కావాలి

image

జనవరిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఈ ఏడాది టాలీవుడ్‌లో రాలేదు. ‘కోర్టు’ చిన్న సినిమాల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. కుబేర, తండేల్, మ్యాడ్ స్క్వేర్, హిట్-3 వంటి చిత్రాలు పర్వాలేదనిపించినా బాక్సాఫీసును షేక్ చేయలేకపోయాయి. దీంతో వచ్చే నెలలో రానున్న ‘OG’పైనే ఆశలు నెలకొన్నాయి. సినిమా‌కు పాజిటివ్ టాక్ పడితే కాసుల వర్షం కురవనుంది. తేజా ‘మిరాయ్’ కూడా ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది.

News August 29, 2025

ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

image

టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) డైరెక్టర్ శ్రీహరి రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 22-28 వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30-సా.5.30 గంటల వరకు ఉండనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 13 వరకు ఉంటాయని ఆయన వెల్లడించారు. పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 29, 2025

నవంబర్ 15లోగా MSME పార్కులు ఏర్పాటు కావాలి: CBN

image

AP: రాష్ట్రంలో ఏరో స్పేస్, IT, ఫుడ్ ప్రాసెసింగ్, MSME రంగాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ₹53,922 కోట్లు ఇన్వెస్ట్ చేసే 30 ప్రాజెక్టులను సీఎం ఆధ్వర్యంలోని పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) ఆమోదించింది. అన్ని నియోజకవర్గాల్లో నవంబర్ 15లోగా MSME పార్కులు ఏర్పాటు కావాలని CM ఆదేశించారు. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.